అమ్మ ప్రేమ ఆదరణ అనాధ ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం

హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా జాతీయ చైర్మన్ చెన్నుపాటి శ్రీకాంత్ గారి ఆదేశాల మేరకు, ఈరోజు విజయవాడ సింగ్ నగర్ లో గల అమ్మ ప్రేరణ ఆధరణ అనాధ ఆశ్రమంలో హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా సంస్థ తరఫున అన్నదాన కార్యక్రమం చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో జాతీయ ప్రధాన కార్యదర్శి నందం నరసింహారావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు కొండ జయలక్ష్మి గారు, స్టేట్ లీగల్ సెక్రెటరీ పెండ్యం రాజ్యలక్ష్మి గారు, ఎన్టీఆర్ జిల్లా ఉమెన్ పోర్టు వైస్ ప్రెసిడెంట్ షేక్ ఆయేషా గారు పాల్గొన్నారు.