DATE :5:1:2024 హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా(HRCI) నేషనల్ చైర్మన్ చెన్నుపాటి శ్రీకాంత్ ఆదేశాలనుసారం, తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ భేతి తిరుమలరావు సూచన మేర. ముందుగా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా తరఫున CI M. కరుణాకర్ గారికి పూల బొకే ఇచ్చి, సాలువాతో సత్కరించడం జరిగినది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 3:1:2024 రోజున వెంకటేశ్వరి W/O రామయ్య తమ కుమారుడు గణేష్ నుండి మాకు న్యాయం చేయాలంటూ, బాధితులు ఇరువురు మన (HRCI) ను కోరడం జరిగినది. వీరి కుమారుడు అయిన గణేష్ 26 సంవత్సరాలు, మత్తు పదార్థాలకు బానిసై తల్లి, తండ్రి, చెల్లిని ఇబ్బందులకు గురి చేస్తూ, మతిస్థిమితం కోల్పోయిన, వ్యక్తి లాగా కుటుంబ సభ్యులను, చుట్టుప్రక్కల వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని తెలియజేయడం జరిగినది.